రొనాల్డో ప్లాప్ షో.. ‘మెస్సీ, మెస్సీ’ నినాదాలతో హోరెత్తిన స్టేడియం.. ఇదిగో వీడియో!
- ఫీఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌కు డీఆర్ కాంగో ఊహించని షాక్
- ఇరు జట్లు 1-1తో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన వైనం
- గోల్ చేయడంలో విఫలమైన రొనాల్డోకు 'మెస్సీ' నినాదాలతో నిరసన
- ప్రపంచకప్‌లో తమ మొట్టమొదటి గోల్‌ను నమోదు చేసిన కాంగో
- రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్‌లో ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డో
ఫిఫా ప్రపంచకప్ 2026లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పోర్చుగల్‌కు ఆరంభంలోనే ఊహించని ఫలితం ఎదురైంది. బుధవారం డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్ కాంగో)తో జరిగిన గ్రూప్-కే ఆరంభ మ్యాచ్‌లో పోర్చుగల్ 1-1 తేడాతో డ్రాగా ముగించింది. పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. మ్యాచ్ అనంతరం కాంగో అభిమానులు 'మెస్సీ, మెస్సీ' అంటూ నినాదాలు చేసి అతడిని మరింత అసహనానికి గురిచేశారు.
ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆట ఆరో నిమిషంలోనే పెడ్రో నెటో అందించిన అద్భుతమైన క్రాస్‌ను జోవా నెవెస్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అయితే, 1974 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న డీఆర్ కాంగో అద్భుతంగా పుంజుకుంది. మొదటి అర్ధభాగం అదనపు సమయంలో ఆర్థర్ మసుయాకు ఇచ్చిన క్రాస్‌ను యోన్ విస్సా హెడర్‌తో గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. ప్రపంచకప్ చరిత్రలో డీఆర్ కాంగోకు ఇదే మొట్టమొదటి గోల్ కావడం విశేషం.
తీవ్రంగా నిరాశపరిచిన రొనాల్డో
రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్‌లో ఆడుతున్న 41 ఏళ్ల రొనాల్డో, ఈ మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఒక్క షాట్‌ను కూడా లక్ష్యం దిశగా కొట్టలేకపోయాడు. ఆటలో కేవలం 25 సార్లు మాత్రమే బంతిని తాకగలిగాడు. రెండో అర్ధభాగంలో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరోవైపు, ప్రత్యర్థి అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ ముందురోజు మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించడంతో, రొనాల్డోపై ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.
మ్యాచ్ ముగిసి టన్నెల్ వైపు వెళ్తున్న రొనాల్డోను ఉద్దేశించి కాంగో అభిమానులు 'మెస్సీ, మెస్సీ, మెస్సీ' అంటూ పెద్దగా నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, రొనాల్డో సంయమనం పాటిస్తూ, అభిమానులకు చప్పట్లతో అభివాదం చేసి ఎలాంటి ప్రతిచర్య చూపకుండా లాకర్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఈ డ్రాతో పోర్చుగల్ గ్రూప్ స్టేజ్‌లో తదుపరి మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.